చత్తీస్గడ్ లోని బీజాపూర్ సిల్గర్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు మావోయిస్టులు కాల్పుల్లో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు డీఆర్జీ, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరో 20 మంది జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్టు చెబుతున్నారు. అయితే జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు. జవాన్లను తరలించేందుకు 9 అంబులెన్స్ లు, రెండు హెలికాప్టర్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
ఈ కూంబింగ్ లో 500 మంది జవాన్లు పాల్గొన్నట్టు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొంతమంది మావోయిస్టులు కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు. “నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా దళాల సంయుక్త బృందం బయలుదేరినప్పుడు సుక్మా మరియు బీజాపూర్ సరిహద్దులో ఈ ఫైరింగ్ జరిగింది” అని ఛత్తీస్‌గడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి.ఎం. అవస్థి అన్నారు.