40 మంది శివసేన రెబల్స్ తో పార్టీని వీడి బయటకు వచ్చిన శివసేన సీనియర్ నేత ఏకనాథ్ షిండే ఏకంగా మహావికాస్ అఘాడి కూటమి నేత ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అమంతంగా కూల్చివేసి మహారాష్ట్ర సీఎం అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వారు తన తండ్రి పేరు చెప్పుకోకుండా వారి తల్లిదండ్రుల పేరు చెప్పుకొని ఓట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రాజ్ ఠాక్రే ఫోటోలను చూపిస్తూ ఓట్లు అడ్కోవద్దని చెప్పారు. తనకి సర్జరీ జరిగినప్పుడు తాను కనీసం కదలని స్థితిలో ఉన్నానని.. ఆ సమయంలో ఒక వ్యక్తిని నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని కల్పించాలని చెప్పారు.
పార్టీని కాపాడతావని నీపై పెట్టుకున్న నమ్మకాన్ని చిద్రం చేశావని షిండే ను ఉద్దేశించి అన్నారు ఉద్ధవ్. అయితే ఉద్ధవ్ తీవ్ర విమర్శలు గుర్తించిన మరుసటి రోజే ఉద్ధవ్ థాక్రే పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని జగదాంబ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.