మానసిక రోగాల కోసం గంజాయి వాడుతున్న వృద్దులు… సర్వే ఏం చెప్తుంది…?

-

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యుసి) శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. వృద్ధులు నొప్పులు భరించడానికి, నిద్రలేమి సమస్యల నుంచి బయటపడటానికి, ఆందోళన సహా నిరాశ వంటి మానసిక పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి రావడానికి, వైద్య ప్రయోజనాల కోసం గంజాయిని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌ లో ఈ అధ్యయనం ప్రచురించారు. గంజాయి అనేది ప్రమాదకరం అయిన సరే అందుబాటులోకి వచ్చిన కొత్త చట్టాలతో…Recreational Marijuana: How Can It Affect Your Health?

వృద్ధులలో గంజాయి వాడకం అనేది సర్వసాధారణం అవుతోందని వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 568 మంది రోగులను సర్వే చేసారు. వారిలో 15 శాతం మంది గత మూడేళ్లలో గంజాయిని ఉపయోగించారని, సగం మంది దీనిని క్రమం తప్పకుండా వైద్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు అని పేర్కొన్నారు. పైన పేర్కొన్న సమస్యల నుంచి బయటపడటానికి రోగులు దీనిని వాడుతున్నట్టుగా రచయిత క్రిస్టోఫర్ కౌఫ్మన్ తెలిపారు. యుసి శాన్ డియాగోలోని మెడిసిన్ విభాగంలో జెరియాట్రిక్స్ మరియు జెరోంటాలజీ విభాగంలో అధ్యయనంతో పాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన అధ్యయనంలో… రోగులు 10 వారాల వ్యవధిలో యుసి శాన్ డియాగో హెల్త్‌లోని మెడిసిన్ ఫర్ సీనియర్స్ క్లినిక్‌లో కనిపించారని పేర్కొన్నారు.

గంజాయిని ఉపయోగించిన రోగులలో 61 శాతం మంది 60 ఏళ్ళ తర్వాత వాడకాన్ని ప్రారంభించినట్లు పరిశోధకులు గుర్తించారు. “ఆశ్చర్యకరంగా, దాదాపు మూడు వంతుల గంజాయి వినియోగదారులు గంజాయిని మొదటిసారిగా వృద్ధులలో ఉపయోగించినట్లు మేము కనుగొన్నాం. గతంలో గంజాయిని ఉపయోగించిన వారితో పోలిస్తే ఈ వ్యక్తులు ఒక ప్రత్యేకమైన గ్రూప్ అని యుసి శాన్ డియాగోలో మూడవ సంవత్సరం వైద్య విద్యార్థి కెవిన్ యాంగ్ తెలిపారు. కొత్తగా వాడే వారు… మత్తు కంటే కూడా వైద్య కారణాల వల్ల గంజాయిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

గంజాయిని ధూమపానం చేయడం ద్వారా తీసుకోవడం లేదా తినడం చేస్తున్నారని, దీనిని ఒక ఔషధంగా వాడుతున్నారు అని పేర్కొన్నారు. ఇక చాలా మంది గంజాయి వాడకం గురించి తమ వైద్యులకు చెప్తున్నారు అని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news