వైసీపీకి ఎన్నికల కమీషన్ షాక్…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వైసీపీ నేతలు కరోనా సాయాన్ని జగనన్న సాయం గా చెప్తూ ప్రజలకు కేంద్రం ఇచ్చిన కరోనా సాయాన్ని పంపిణి చేసిన సంగతి తెలిసిందే. కరోనా డబ్బులు జగన్ కష్టాల్లో ఉన్నా ఇస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటు వెయ్యాలని వాళ్ళు కోరారు. దీనిపై సోషల్ మీడియాలో వీడియో లు వైరల్ అయ్యాయి. దీనితో రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసాయి.

ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల కోడ్ అనేది అమలులో లేకపోయినా సరే రాష్ట్రంలో ప్రచార౦ నిషేధం అని అలా చేసే వారిపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టంగా చెప్పారు. దాన్ని సహించవద్దు అని ఆయన కలెక్టర్లకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు రమేష్ కుమార్.

ఒకవేళ ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తే వారి వివరాలు పంపాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు లేఖలు రాశారు. వెంటనే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలన్నారు. వైసీపీ నేతలు కొన్ని జిల్లాల్లో పోటి చెయ్యాలనుకున్న వాళ్ళు ప్రచారం చేస్తూ నగదు పంపిణి చేసారు. రేషన్ బియ్యాన్ని పంచకుండా డబ్బులను దగ్గరికి వెళ్లి ఇచ్చి రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news