శరీర అలసటని ,నీరసంని తట్టుకోవటానికి అందరు చూసేది పళ్ళ రసాల వైపే. కాని ఈ కరోనా నుండి తప్పించుకోవటానికి సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లని తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. కమలా కాయల్ని మనం తిని వాటి తొక్కల్ని పారేస్తున్నాము. కాని కమలా పండులో ఉన్నన్ని పోషకాలు తొక్కలోను ఉంటాయి.
కమలా పండ్ల తొక్కలని స్నానం చేసేటప్పుడు చర్మంపై మృదువుగా రుద్దితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. చర్మం మంచి సువాసన కూడా వస్తుంది. కొన్ని కమలా తొక్కల్ని ఆయిల్ లో వేసి ఆ ఆయిల్ ని మన అవసరాలకు వాడుకోవచ్చు. ఎండిన ఆరెంజ్ తొక్కల్ని టీలో వేసి లవంగాలు, కొద్దిగా అల్లం వేసి మరిగాక తాగితే ఆరెంజ్,గ్రీన్ టీ తాగినట్లే.
కమలా తొక్కలు ఎండిపోయాక ఇంట్లో అలమరలో,వార్డ్ రోబ్స్ లో పెడితే సువాసన వస్తుంది. కమలా తొక్కల్ని ఉపయోగించి సెంట్స్ కూడా తయారుచేస్తారు. ప్రతి రోజు ముఖం పై కమలా తొక్కలని రుద్దితే మొటిమలు రావు. తాజా కమలా తొక్కల వాసన పీల్చితే మానసిక ప్రశాంతత కలిగి చక్కని నిద్ర పడుతుంది. చర్మ వ్యాధులు కూడా కమలా తొక్కలు రుద్దితే మటుమాయం అవుతాయి.