నోటాకు ఓట్లు ఎక్కువగా వేస్తే ఎన్నికల ఫలితాలు రద్దు చేయాలి: సుప్రీంకోర్టు

-

న్యూఢిల్లీ: నోటాకు గ‌రిష్టంగా ఓట్లు పోలైన‌ట్లైతే ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయాలంటూ న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బొబ్డే, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై న్యాయ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, భారత ఎన్నికల సంఘం నుంచి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

EVM_AP
EVM_AP

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే.. నోటాకు ఎక్కువ ఓట్లు పోలైనప్పుడు ఎన్నికల ఫలితాలు రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ పోలైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తాజా ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపిందన్నారు. నోటాకు ఎక్కువగా ఓట్లు పోలైన నిర్ధిష్ట నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు చేయబడిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలను తాజా ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసిందన్నారు.

అభ్యర్థులను ఎన్నుకునే హక్కు ఓటర్లకు ఉందని, నచ్చనప్పుడు తిరస్కరించే హక్కు ప్రజలకు ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పోటీ చేసే అభ్యర్థుల పనితీరుపై ఓటర్లు అసంతృప్తిగా ఉంటే నోటా గుర్తును ఉపయోగించుకుంటారు. వారి పాలన బాగుండదనే భావించే నోటాకు ఓట్లు వేస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు తమను ఆ అభ్యర్థుల పాలన నచ్చలేదనే నోటాకు ఓటు వేశారని.. కొత్త అభ్యర్థులను ఎన్నుకునే సౌకర్యాన్ని కల్పించే దిశగా ఎన్నికల సంఘం పని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news