చైనాలో పెళ్లి వయసు తగ్గించి.. పిల్లల్ని కనేందుకు ఒత్తిడి..!

-

ఇటీవల చైనాలో అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల మానసిక ఆరోగ్యం, జెండర్ వహించే పాత్ర, సెలబ్రిటీలు వంటి అంశాలపై చర్చించారు. ఇందులో సాధారణ అంశాలతోపాటు కాసింత వింతగా అనిపించే అంశాలను, వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. వీటిలో కొన్నింటిని దేశ తీవ్రమైన సమస్యగా భావించిన అంశాలపై కూడా చర్చించారు. గత మంగళవారం చైనా ప్రభుత్వ అత్యున్నత సలహా సంఘం (సీపీపీసీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంపై ఆన్‌లైన్‌లో కూడా పెద్ద చర్చే జరిగింది.

China
China

ఈ సమావేశంలో మహిళలు, పురుషులు ఎలా ఉండాలి. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై సమావేశం నిర్వహించారు. ఇందులో స్త్రీ, పురుషుల వివాహ వయసు 18 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదన ముందుకు వచ్చింది. అలాగే స్కూల్ బుక్స్‌లో ప్రేమ, పెళ్లి అనే అంశాలను చేర్చాలనే ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఈ విషయంపై చాలా మంది మహిళలు వ్యతిరేకించారు. అమ్మాయిలు స్కూల్ మానేసి.. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అభిప్రాయపడ్డారు.

అలాగే ప్రసూతి సెలవుల సమయాన్ని పొడిగించాలని, కుటుంబ నియంత్రణ విధానాల సడలింపుపై ప్రతిపాదనలు వచ్చాయి. అవివాహిత చైనీస్ మహిళలు పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివక్షకు గురవుతున్నారని, ఇలాంటి ప్రతిపాదనల వల్ల మరింత తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, చైనాలో వివాహాలు, జననాల రేటు రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది. చైనాకు చెందిన చాలా మంది మహిళలు, యువతులు వృత్తిపరంగా రాణించాలని భావిస్తున్నారు. దీంతో వివాహాలు, జననాల రేటు తగ్గుతూ వస్తున్నాయి. కానీ, చైనాలో ఒకే బిడ్డ ఉండాలనే ప్రతిపాదన ఉంది. పుట్టిన పిల్లాడితోపాటు తల్లిదండ్రులను కూడా చూసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నట్లు చైనీయులు వాదిస్తున్నారు. దీంతోపాటు ప్రాథమిక పాఠశాలల్లో మహిళా టీచర్లు ఎక్కువగా ఉండటంతో ప్రైమరీ, సెకండరీ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పురుషులు, స్త్రీల సంఖ్యలో సమతుల్యత తీసుకురావాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news