కూటమి గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఎన్నికలు వాయిదా : భూమన కరుణాకర్ రెడ్డి

-

తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మా పార్టీ విజయం సాధించేది కాబట్టి.. కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి.. ఎన్నిక వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ దీనిని తక్షణమే స్పందించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.  ఎన్నికల అధికారి టీడీపీకి అనుకూలంగా పని చేశారని ఆయన చెప్పారు. కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకోవాల్సిన బాధ్యత ఎప్పీ మీద ఉందా..? అని ప్రశ్నించారు.

తిరుపతి ఎమ్మెల్యే మదన్ గూండాయిజం చేస్తూ రాజకీయ క్షోభను సృష్టించారని ఆయన ఆరోపించారు. తిరుపతిలో చోటు చేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపులు, గూండాయిజం గురించి మాట్లాడిన భూమన.. మా పార్టీ తరపున గెలిచిన 48 మంది కార్పొరేటర్లలో కొందరిని బెదిరించి.. భయపెట్టి లాక్కున్నారని తెలిపారు. ఉమా, శేఖర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి ఆస్తులపై దాడి చేసిన మంత్రి తిరుపతిలో ఈ దౌర్జన్యాలకు పునాది వేశారని ఆయన పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news