కేంద్రానికి రాకేష్ టికాయత్ హెచ్చరిక… నవంబర్ 26 వరకు డెడ్ లైన్

-

గత ఏడాది నవంబర్ నుంచి రైతు సంఘాలు కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతుచట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. పలు మార్లు కేంద్రంలో రైతు సంఘాల నేతలు చర్చించినా ఫలితం లేకపోయింది. తాజాగా మరో మారు రైతు సంఘాలు కేంద్రానికి హెచ్చరికలు చేసింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ రైతుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నవంబర్ 26 వరకు కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోని పక్షంలో నవంబర్ 27 నుంచి ఢిల్లీ సరిహద్దులను ట్రాక్టర్లతో దిగ్భందిస్తామని కేంద్రాన్ని రాకేష్ టికాయత్ హెచ్చరించాడు.

మరో వైసే ప్రభుత్వం సరిహద్దుల్లో రైతుల నిరసన శిబిరాలను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తుందని ఆరోపించారు. రైతుల టెంట్ లను జేసీబీల సహాయంతో తీసేస్తున్నారన్నారు. కేంద్రం ఇలాగే చేసిన పక్షంలో రానున్న రోజుల్లో రైతులు జిల్లా పోలీస్, కలెక్టర్ కార్యాలయాల్లో టెంట్లు వేస్తారని హెచ్చిరించారు. మరోవైపు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు టిక్రి, సింఘు సరిహద్దుల్లో బారికేడ్లను గత గురువారం నుంచి అధికారులు తొలగిస్తున్నారు. రైతుల నిరసనలపై సుప్రీం కోర్ట్ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది, నిరసన చేేసే హక్కు రైతులకు ఉంది, కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లను బ్లాక్ చేసే అధికారం లేదని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news