ట్విటర్‌ సీఈవోగా ఉండాలా.. వద్దా?.. ఎలాన్‌ మస్క్‌ పోల్‌

-

ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించినప్పటి నుంచి కొనుగోలు పూర్తి, మాస్ లే ఆఫ్స్, ట్విటర్‌లో భారీ మార్పులు ఇలా ప్రతి విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. తాను ట్విటర్‌ సీఈవోగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఈ విషయమై ట్విటర్‌లో పోల్‌ కూడా నిర్వహించారు.

‘ట్విటర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా? వద్దా?. ఎలాంటి ఫలితం వచ్చినా, దానికి కట్టుబడి ఉంటా. మీరు ఏం కోరుకుంటే, అదే జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా కోరుకోండి. భవిష్యత్తులో కీలక విధానాల మార్పులపై పోల్స్​ నిర్వహిస్తా.’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. సాయంత్రం 4.30 గంటల వరకు ఈ పోల్‌ జరగనుంది.అయితే ఈ ఓటింగ్‌లో మస్క్‌కు ప్రతికూలంగానే స్పందన వస్తోంది. ఇప్పటిరకు సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని 57.6 శాతం మంది అంటే, నో అని 42.4 శాతం మంది అన్నారు. సాయంత్రం వరకు ఓటింగ్‌ ఇలాగే కొనసాగితే ట్విటర్‌ సీఈఓగా మస్క్‌ తప్పుకుంటారో లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news