ఎలాన్ మస్క్‌ వర్సెస్‌ కమలా హ్యారిస్‌.. అబార్షన్ పోస్టుపై వివాదం

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అబార్షన్ అంశం కీలకాంశంగా మారింది. బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తుంటే.. ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా తాజాగా ఈ వ్యవహారంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విమర్శలు గుప్పించారు.

ట్రంప్‌ దేశవ్యాప్తంగా అబార్షన్ను నిషేధిస్తానంటున్నారని కమలా హ్యారిస్‌ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. దీన్ని బైడెన్ నేతృత్వంలోని బృందం ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతుందని తెలిపారు. తద్వారా మహిళల సంతానోత్పత్తి హక్కును పరిరక్షిస్తామని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ ‘కమ్యూనిటీ నోట్‌’ ట్యాగ్‌ను జత చేసింది.

కమలా హ్యారిస్‌ పోస్ట్‌పై మస్క్‌ స్పందిస్తూ.. ‘‘ఎక్స్‌లో అబద్ధాలు పోస్ట్‌ చేయడం ఇక ఎంతమాత్రం కుదరదనే విషయాన్ని రాజకీయ నాయకులు లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే వ్యక్తులు ఎప్పుడు తెలుసుకుంటారు’’ అని ప్రశ్నించారు. ఇటీవల బైడెన్‌తో జరిగిన చర్చలో తాను అబార్షన్ను బ్యాన్ చేయబోనని ట్రంప్‌ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news