రోడ్డుపై రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో చూశారా?

-

T20 వరల్డ్కప్ విన్నర్ టీమ్ఇండియా ఇవాళ ఉదయం భారత్కు చేరుకుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్లేయర్లంతా దిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకోగా వారికి ఘన స్వాగతం లభించింది. విశ్వ వేదికపై భారత్ను విజేతగా నిలిపిన ఛాంపియన్లకు క్రికెట్ ఫ్యాన్స్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు.హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది.

బ్యాండ్ బాజాలతో టీమిండియాకు హోటల్ స్టాఫ్ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా బ్యాండ్ బాజా వారితో కలిసి టీమ్ ఇండియా ప్లేయర్లు స్టెప్పులేశారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ బస్సు దిగగానే ఓ చేతిలో తన లగేజ్తో డ్యాన్స్ చేశారు. బీట్స్ అనుగుణంగా స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి హిట్మ్యాన్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news