ఏలూరులో ఉత్కంఠ.. 47 డివిజన్లకు ఏకకాలంలో ఓట్ల లెక్కింపు

-

ఏలూరు: కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 47 డివిజన్లకు సంబంధించిన ఓట్లను అధికారులు ఏకకాలంలో లెక్కిస్తున్నారు. సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 4 సెంటర్లలో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు పురపాలక సంఘం అధికారులు కూడా ఈ ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. మరికాసేపట్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాలేజీకి 100 మీటర్ల దూరంలోనే వాహనాలకు అనుమతించారు. అధికారులు అనుమతి ఉంటేనే అభ్యర్థులను ఇతరులను కాలేజీలోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా కాలేజీ సమీపంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version