వెస్ట్‌లో మారుతున్న లీడ్..వైసీపీకి షాకేనా!

-

ఏపీలో అధికార వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉందని గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే బలం బట్టి చూస్తే అన్నీ జిల్లాల్లో వైసీపీకి తిరుగులేదని చెప్పొచ్చు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్లలో ప్రతిపక్ష టీడీపీ ఎక్కడా పుంజుకోలేదా? అంటే కొన్ని చోట్ల పుంజుకుందనే చెప్పొచ్చు. అధికార బలం ఉండటంతోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిందిగానీ, పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకిత టీడీపీకి కలిసొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో లీడ్ మారిందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న 15 సీట్లలో వైసీపీ 13 చోట్ల గెలిచింది. రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటడంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ మీద వ్యతిరేకిత వస్తుందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చకపోవడం, కేవలం జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాల మీదే ఆధారపడటంతో వైసీపీకే మైనస్ అవుతుందని అంటున్నారు.

అదే సమయంలో టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లాంటివి ప్లస్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గానే ఉన్నారని తెలుస్తోంది. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని అర్ధమవుతుంది. అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లు కనబడుతోంది.

అలా టీడీపీ పుంజుకున్న నియోజకవర్గాల్లో దెందులూరు, తణుకు, ఉంగుటూరు, నిడదవోలు, గోపాలాపురం, చింతలపూడి లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూల పరిస్తితులు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే వెస్ట్‌లో వైసీపీకి షాక్ ఇస్తూ టీడీపీ లీడ్‌లోకి వచ్చినట్లు కైపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version