ఉద్యోగులారా.. ఈ విషయం మర్చిపోతే.. మీ పీఎఫ్‌ ఖాతా క్లోజ్‌ అవుతుంది..!

-

ఉద్యోగులకు EPFO ఖాతా చాలా ముఖ్యమైనది. దీన్ని సరిగ్గా మెయింటేన్‌ చేయకపోతే అనవసరంగా పెన్షన్‌ డబ్బు వేస్ట్‌ అవుతుంది. అయితే కొన్ని విషయాలు తెలుకోవడం ప్రతి ఉద్యోగికి చాలా అవసరం. కొందరు జాబ్‌ చేసి మానేశాక.. ఎలాంటి కంపెనీలో చేరకపోతే… ఆ పీఎఫ్‌ అకౌంట్‌ అలానే ఉండిపోతుంది. దాని వల్ల కొన్ని రోజులకు మీ ఖాతా క్లోజ్‌ అయిపోతుంది.

ఖాతా మూసివేయబడవచ్చు

మీరు ఇంతకు ముందు పని చేసిన కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మీ పీఎఫ్‌ ఖాతాను బదిలీ చేయకపోతే పాత కంపెనీ మూసివేస్తే మీకు చాలా నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితిలో మీ పీఎఫ్‌ ఖాతా నుంచి 36 నెలల పాటు ఎటువంటి లావాదేవీ జరగకపోతే మీ పీఎఫ్‌ ఖాతా మూసివేస్తారు. ఈపీఎఫ్‌వో అటువంటి ఖాతాలను ‘ఇన్‌ఆపరేటివ్’ కేటగిరీలో ఉంచుతుంది.

మళ్లీ యాక్టివ్‌ చేసుకోవడం ఎలా..?

ఇది మళ్లీ ఎలా యాక్టివ్‌ అవుతుంది ఖాతా ‘నిష్క్రియం’ అయిన తర్వాత మీరు లావాదేవీని చేయలేరు. ఖాతాను మళ్లీ యాక్టివ్‌గా చేయడానికి మీరు ఈపీఎఫ్‌వోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక బెనిఫిట్‌ ఏంటంటే.. ఖాతా పనిచేయకున్నా సరే.. అప్పటికే అందులో ఉన్న డబ్బుకు మీకు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. మీరు దాన్ని తిరిగి పొందుతారు.

ఇంతకు ముందు ఇటువంటి ఖాతాలపై వడ్డీ లభించేది కాదు. కానీ 2016లో నిబంధనలను సవరించారు. మీరు 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మీ PF ఖాతాపై వడ్డీ జమ అవుతుంది.

ఖాతా ‘పనిచేయనిది’ ఎప్పుడు..?

అయితే.. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ విత్‌డ్రా కోసం దరఖాస్తు చేయనట్లయితే EPF ఖాతా ‘నిష్క్రియ’ అవుతుంది. అలాగే రిటైర్మెంట్‌ చేసి 36 నెలల తర్వాత లేదా సభ్యుడు 55 సంవత్సరాల తర్వాత ఖాతా ‘నిష్క్రియ’ అవుతుంది లేదా సభ్యుడు మరణించిన సందర్భంలో ఖాతా ‘నిష్క్రియ’ అవుతుంది. పనిచేయని PF ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌ను సెటిల్ చేయడానికి ఉద్యోగి యజమాని ఆ క్లెయిమ్‌ను ధృవీకరించడం అవసరం. అయితే కంపెనీ మూసివేస్తే ఉద్యోగులు క్లెయిమ్‌ను ధృవీకరించడానికి ఎవరూ లేకుంటే KYC పత్రాల ఆధారంగా బ్యాంక్ బ్యాంకు ఆ మొత్తాన్ని ఖాతాదారుడికి అందజేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news