vishal : యాక్షన్ త్రిల్లర్ గా ‘ఎనిమి’ ట్రైలర్

హీరో విశాల్… ఎప్పుడు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. అలాగే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తారు హీరో విశాల్. అయితే తాజా గా హీరో విశాల్ మరియు ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ” ఎనిమీ “. ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. వాడు-వీడు సినిమా తర్వాత… హీరో విశాల్ మరియు ఆర్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. మృణాళిని రవి మరియు మమత మోహన్ దాస్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

ఇక ఈ ట్రైలర్ లో… హీరో విశాల్ మరియు ఆర్య పర్ఫామెన్స్ పీక్స్ లోకి వెళ్ళింది. పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ ట్రైలర్ ఉంది. మొత్తం మీద ‘ఎనిమి’ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీన అంటే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున రజనీకాంత్ పెద్దన్న మూవీ కూడా విడుదల కానుండటం విశేషం.