ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

-

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్ అవుట్ కాగా, బదులుగా ఇంగ్లాండ్ 524 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ మాత్రం అంత ఈజీ గా ఇంగ్లాండ్ బౌలర్లకు తలొగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ ఏకంగా ట్రయిల్ స్కోర్ ను దాటుకుని 10 పరుగులు లీడ్ చేసి ఆల్ అవుట్ అయింది. ఐర్లాండ్ బ్యాటింగ్ లో టెక్టర్ 51, టక్కర్ 44, మేక్ బ్రిన్ 86 మరియు అడైర్ 88 పరుగులు చేసారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల లలో జయేష్ టాంగ్ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ ను శాసించాడు. దీనితో ఇంగ్లాండ్ ముందు కేవలం 11 పరుగులు మాత్రమే టార్గెట్ మిగిలింది.

 

ఈ స్కోర్ ను ఇంగ్లాండ్ మొదటి ఓవర్ లోనే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మూడు ఫోర్లు బాధేసి 10 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news