ENG VS NZ 3RD ODI: కెరీర్ లో బెన్ స్టోక్స్ 4వ సెంచరీ

-

ఈ రోజు ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మూడవ వన్ డే లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా సాగిపోతోంది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి సరైన ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఇతనికి మిగిలిన బౌలర్ల నుండి సహాయం లేకపోవడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు డేవిడ్ మలన్ మరియు బెన్ స్టోక్స్ లు కుదురుకుని బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 199 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. న్యూజిలాండ్ పై వన్ డే లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ కెరీర్ లో 4వ సెంచరీ సాధించాడు. బెన్ స్టోక్స్ 76 బంతుల్లో 11 ఫోర్లు మరియు 3 సిక్సులు సహాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

కానీ డేవిడ్ మలన్ మాత్రం సెంచరీ కి మరో నాలుగు పరుగుల దూరంలో ఉండగా బౌల్ట్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇతను ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు మరియు సిక్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news