థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యాల‌పై అసంతృప్తి.. రిఫ‌రీకి ఫిర్యాదు చేసిన ఇంగ్లండ్ టీమ్..

-

భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య అహ్మ‌దాబాద్‌లో జ‌రుగుతున్న 3వ టెస్టు మ్యాచ్ తొలి రోజు ప‌లు థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యాలు భార‌త్‌కు అనుకూలంగా వ‌చ్చిన విష‌యం విదిత‌మే. మ్యాచ్‌లో ఆ విధంగా జ‌ర‌గ‌డంపై ఇంగ్లండ్ టీమ్ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. మైదానంలో ప‌లు మార్లు ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు ఫీల్డ్ అంపైర్ల‌తో వాద‌న‌ల‌కు దిగారు. అయితే థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యాల‌పై వారు పూర్తిగా అసంతృప్తి చెందారు. దీంతో వారు మ్యాచ్ రిఫ‌రీ జ‌గ‌వ‌ళ్ శ్రీ‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు.

englang upset over third umpire decisions given complaint to referee

మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా శుభ‌మ‌న్ గిల్ క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న బెన్ స్టోక్స్ ప‌ట్టాడు. అత‌ను బంతిని నేల‌కు తాకాక ప‌ట్టుకున్న‌ట్లు రీప్లేలో తేలింది. ఇక మ‌రో స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ‌ను బెన్ ఫోక్స్ స్టంప్ అవుట్ చేసేందుకు య‌త్నించ‌గా, స‌రైన స‌మ‌యానికే రోహిత్ కాలిని క్రీజులో ఉంచాడు. అయితే ఈ రెండు సందర్భాల్లో థ‌ర్డ్ అంపైర్ చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ టీమ్ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

ఆయా ఘ‌ట‌న‌ల్లో మ‌రిన్ని కెమెరా యాంగిల్స్‌ను వాడ‌కుండానే థ‌ర్డ్ అంపైర్ త్వ‌ర‌గా నిర్ణయాన్ని ప్ర‌క‌టించాడంటూ ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వ‌ర్‌వుడ్‌లు మ్యాచ్ అనంత‌రం రిఫ‌రీ జ‌గ‌వ‌ళ్ శ్రీ‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. మ్యాచ్‌లో ఈ విధంగా జరిగితే అంపైర్ల నిర్ణ‌యాల‌కే విలువ లేకుండా పోతుంద‌ని వారు శ్రీ‌నాథ్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంగ్లండ్‌కు మ‌రో ప్లేయ‌ర్ జాక్ క్రాలీ మాత్రం తొలి రోజు త‌మకు ల‌క్ క‌ల‌సి రాలేద‌ని, క‌నీసం 50-50 అన్న‌ట్లుగా కూడా మ్యాచ్ సాగ‌లేద‌ని, రెండో రోజు త‌మ స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news