సమగ్ర కుటుంబ సర్వే కోసం విధులు నిర్వహించేందుకు వచ్చిన మహిళా ఎన్యూమరేటర్ల వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై టీఎస్పీఎస్పీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఘాటుగా స్పందించారు. ‘ఇలాంటి వీడియోలు చాలా మంది షేర్ చేస్తున్నారు. ఈ సర్వే కోసం వస్తున్న వాళ్లు నాయకులో కార్యకర్తలో కాదు.సాధారణ ఉద్యోగులు, వాలంటీర్లు. వాళ్లు విధి నిర్వహణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాలు సేకరించడానికి వచ్చారు తప్ప మీ ఇంటికి బిచ్చం ఎత్తుకోవడానికి కాదు.
వాళ్ల ఫోటోలు వీడియోలు తీసే అధికారం మీకెక్కడిది? ఈ వీడియోలో ఆ ఉద్యోగిని వెంటాడి వీడియోలో బంధిస్తున్న ఆ మహిళ మాత్రం తన ఐడెంటిటీని కాపాడుకుంటోంది. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీ విమర్శను మీరే స్వయంగా వీడియో చేసి పెట్టండి. లేదా మీకు కులగణన పట్ల ఆసక్తి లేకుంటే లేదని చెప్పండి. అంతే తప్ప వీడియో లు ఆన్ చేసి విధి నిర్వహణలో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టడం , దాన్ని నెట్టింట షేర్ చేయడం నేరం.ఇతరుల ప్రైవసీకి ఆటంకం కలిగించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడం కూడా. దీనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, సీఎం రేవంత్ రెడ్డికి ఈ వీడియోను ఆయన ట్యాగ్ చేశారు.