ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు ప్రారంభం..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సర్వీసుల ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. మెంబర్ పోర్టల్‌ లో ఆన్‌లైన్ ఫెసిలిటీ ని అందుబాటులో ఉంచింది. దీనితో జాయింట్ ఆప్షన్ కింద అధిక పెన్షన్ ని తీసుకోవాలని అనుకుంటే ఈ ఆన్‌లైన్ సర్వీసులుని ఉపయోగించుకోవచ్చు.

2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఎక్కువ పెన్షన్ ని ఉపయోగించుకోవచ్చు. అప్లికేషన్లను సబ్మిట్ చెయ్యచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌వో ఈ సర్వీసులను తీసుకు రావడం జరిగింది. ఎక్కువ పెన్షన్ ని పొందాలంటే
ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ని సబ్మిట్ చెయ్యచ్చు. దీనితో ఏ ఇబ్బంది ఉండదు. చాలా ఈజీగా అప్లికేషన్ ని కూడా సబ్‌మిట్ చేయొచ్చు.

2022 నవంబర్ నెల ఆదేశాలను చూస్తే అధిక పెన్షన్ పొందటానికి సబ్‌స్క్రైబర్లకు ఇంకో అవకాశాన్ని ఇచ్చింది. అధిక పెన్షన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంచింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి వున్నా
ఎంప్లాయీస్ పెన్షన్ కోసం పరిమితి విధించిన శాలరీలో 8.33 శాతం కాకుండా వాస్తవిక శాలరీలో 8.33 శాతం కంట్రిబ్యూట్ చేసుకో వచ్చని అంది. పేమెంట్ ఆర్డర్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ ఇలాంటి డీటెయిల్స్ ని అప్లికేషన్ ఫామ్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ సరిగ్గా పని చెయ్యడం లేదుట. కనుక ఇంకో ఫీచర్ ని తీసుకు రావచ్చు. ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌వో పీఎఫ్ పాస్ బుక్ చెకింగ్ సర్వీసులు ని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news