రామ్ చరణ్ తీసుకెళ్తేనే వస్తా.. షారుక్ ఖాన్..!

-

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పఠాన్.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై షారుక్ ఖాన్ హీరోగా… దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న చిత్రం పఠాన్ . జనవరి 25వ తేదీన హిందీ, తెలుగు , తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే పఠాన్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా షారుక్ ఖాన్ తన సోషల్ మీడియా మాధ్యమంలో #AskSRK సెషన్ నిర్వహించి.. అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందులో భాగంగానే తన అభిమానులు, నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఫన్నీగా సమాధానాలు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు.

ఇకపోతే అలాంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న… అలాగే దానికి షారుక్ ఇచ్చిన సమాధానం రెండూ కూడా అందరిని ఆకర్షించాయి.. ఒక అభిమాని షారుక్ తో ” హాయ్ సర్.. మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ కి వస్తారా?” అని ప్రశ్నించాడు.. అయితే దానికి సమాధానం చెబుతూ..” తప్పకుండా.. అయితే నన్ను రామ్ చరణ్ తీసుకెళ్తేనే తెలుగు థియేటర్స్ కి వస్తాను” అంటూ సమాధానం ఇచ్చారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన మరోసారి ప్రస్తావించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంది.

గతంలో కూడా ఈ ఇద్దరు తమ అభిమానులను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.మరోవైపు జనవరి 10న పఠాన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విడుదల చేసి యూనిట్ కి అభినందనలు కూడా తెలియజేశారు. ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో రామ్ చరణ్ గురించి స్పందించడంతో ఇప్పుడు సెన్సేషనల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news