ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

-

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు చేరనున్నాయి. టీడీపీ నుంచి ఏడుగురికి మరియు వైసీపీ నుంచి ఒక సభ్యునికి పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో ఏపీ అసెంబ్లీ కౌన్సిల్ లో అధికార వైసీపీ పార్టీ సంఖ్యా బలం 21 చేరనుంది. అటు మండలిలో టిడిపి పార్టీ బలం 15 పడిపోతుంది.

కరోనా మహమ్మారి కారణంగా ఖాళీ అయిన ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఆలస్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఇటీవలే ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న నలుగురు ఎమ్మెల్సీ లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేసారు. దీంతో గవర్నర్ కోటాలో లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు ఎంపిక అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news