కరోనా కారణంగా అంగ స్తంభన సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారు?

-

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కరోనా నుండి రికవరీ అయ్యాక వచ్చే సమస్యల్లో అంగ స్తంభన సమస్య కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కరోనా నెగెటివ్ వచ్చాక చాలా మంది పురుషుల్లో స్తంభన సమస్యలు తలెత్తుతున్నాయట. ఇటలీకి చెందిన వైద్య బృందం పరిశోధించిన ప్రకారం కరోనా నుండి రికవరీ అయ్యాక హృదయనాళ వ్యవస్థ మీద ప్రభావం పడుతుందని, దాని కారణంగా అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఐతే ప్రస్తుతానికి దీని మీద ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని, ఇప్పుడప్పుడే తుది నిర్ణయానికి రాలేమని అంటున్నారు. విపరీతంగా పరిశోధించిన తర్వాత, కరోనా కారణంగానే ఇలా అయ్యిందా లేదా కరోనా వల్ల మారిన పరిస్థితుల వల్ల ఇలా అవుతుందా అనేది తెలుసుకుంటున్నారు. పరిస్థితులని బట్టి చూస్తే, కరోనా కారణంగా ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఇంకా కుటుంబలో జరిగిన విషాధాలు తీవ్ర ఒత్తిడిలోకి దారి తీసాయి. అదీగాక కొత్తగా పెళ్ళైన వారు గర్భం విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

కరోనా టైమ్ లో గర్భం దాలిస్తే ఆస్పత్రుల చుట్టూ తిరగడాలు మొదలగునవి ఉంటాయన్న భయమూ ఉంది. ఈ కారణాలన్నీ కలిసి ఒత్తిడి తీసుకువస్తున్నాయి. మానసికంగా పెరుగుతున్న ఒత్తిడి కూడా అంగస్తంభన సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇంకా సొంతంగా మందులు తయారు చేసుకుని అది తాగితే మంచిదని, ఇది తాగితే మంచిదని, ఏది పడితే అది తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సమస్యపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సి ఉందని, అంగస్తంభన సమస్యలకు కరోనా కారణం అవుతుందా అన్న విషయం తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news