ప్రధాని మోడీ తెలంగాణ టూర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్ అయ్యారు. 40 ఏళ్లు గా రాజకీయ ల్లో ఉన్నాను… గత ప్రభుత్వాలకన్న కేసీఆర్ ప్రభుత్వం లోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఐదు వేల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలిపిన ఎకరాకు పది వేల రూపాయలు ప్రకటించిన మహానుభావుడు కేసిఆర్ అని కొనియాడారు. ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ ల్లో మోటర్లు మీటర్లు పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వలదని మండిపడ్డారు.
తన ప్రాణం ఉన్నంత వరకు మోటర్లు మీటర్లు పెట్టేదిలేదు లేదని తేల్చి చేప్పిన వ్యక్తి కేసిఆర్ అన్నారు. ఉపాధి హామీ పథకం ఎందుకు మీకు కక్ష సాధింపు బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారని నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పనులకు ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారు… కూలీలకు గడ్డపార, తట్టలను కోత పెట్టారు, మెడికల్ కిట్ లను కూడా అందించడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం ఎత్తి వేయాడానికి చేస్తున్న పనుల పై ప్రధాని మోడి ఈ రోజు సమాధానం చెప్పాలి.. రాష్ట్రంనికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా హైదరాబాద్ లో షో చేయడానికి వస్తున్నారని ఆగ్రహించారు.