సూర్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… ‘ ఈటి’ మూవీ తెలుగు టీజర్ విడుదల

-

విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే తమిళ స్టార్ హీరో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తాజాగా సూర్య నటించిన ‘ ఈటి’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. దీంతో సూర్య అభిమానులకు పండగే. ఇప్పటికే తను చేసిన ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. జై భీం సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. విమర్శకుల ప్రశంసలను పొందింది. తాజాగా మరో విభిన్న సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు సూర్య. 

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతునంది ఈటి. టీజర్ చూస్తే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య పక్కన.. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. డి. ఇమాన్ మ్యూజిక్ అందించారు. సన్ పిక్చర్ పతాకంపై ఈసినిమాను రూపొందిస్తున్నారు. మార్చి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చాలా కాలం తరువాత సూర్య సినిమా థియేటర్లలో వస్తుండటంతో… ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు. ఈ చిత్రానికి సూర్యనే తెలుగు డబ్బింగ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news