రైతుబంధు పెంచి ఇవ్వాలి : హరీష్ రావు

-

రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాన చినుకు పడితే రైతు బంధు పైసలు పడేవి.ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అని అన్నారు.షరతులు లేకుండా ఎకరాకు రూ. 7500 ఇవ్వాలి.ప్రసంగాల్లో, మ్యానిఫెస్టోలో పంట కాలానికి ముందే ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పి చెప్పారు.ఇప్పుడు రైతులను మోసం చేయడం సరికాదు.పంట ప్రారంభం అయ్యింది. విత్తనాలు వేస్తున్నారు. రైతు భరోసా వేయడం లేదు.

కెసిఅర్ బస్సు వేసుకొని అడిగితే రైతు బంధు కొందరికి వేశారు.ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి సారించాలి.జనుము, జీలుగ విత్తనాలు కొరత ఉంది. సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నది.ఎరువులు కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.ఎన్నికలకు ముందు అన్ని పంటలకు 500 బోనస్ అని, ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తమంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి .రైతులను దగా చేయడం మంచిది కాదు.అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని బి ఆర్ ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news