మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్, టి పి సి సి గా రేవంత్ రెడ్డి నియామకం, షర్మిల కొత్త పార్టీ తదితర అంశాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటి వరకు చప్పగా సాగిన తెలంగాణ పాలిటిక్స్.. ఇప్పుడు మంచి వేడి వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా పాదయాత్రలు చేస్తామంటూ అన్ని పార్టీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, షర్మిల పాదయాత్ర చేయబోతున్నామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అయితే.. తాజాగా హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. అయితే…. ఆయన తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పాదయాత్రను మరో రెండు లేదా మూడు రోజుల్లో మొదలు పెట్టనున్నారు ఈటల రాజేందర్. కమలాపుర్ బత్తినివాని పల్లె నుండి ఈ పాదయాత్రను ప్రారంభించనున్న ఈటల… నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.కాగా.. గత నెలలో చేసిన ఈటల రాజీనామాతో… హుజురాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది.