నన్ను చంపడానికి కుట్రలు…ముఠాను దించారు : ఈటల సంచలన ఆరోపణలు

పాదయాత్రలో భాగంగా ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని… హంతక ముఠా తో చేతులు కలిపారని తనకు సమాచారం వచ్చిందని ఆరోపించారు ఈటల. అరె కొడకల్లారా! నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదని… ఈ చిల్లర ప్రయత్నాలకు ఈనాడు కూడా భయపడనని స్పష్టం చేశారు..

కెసిఆర్ రజాకార్ల రాజ్యం చేసాడని.. దళిత బందు పెట్టారట సంతోషమని పేర్కొన్న ఈటల… 3 ఎకరాలు అమలు కాలేదు, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల కోసం పథకాలు తీసుకు రావద్దని… రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నారని మండిపడ్డారు. ఫాంహౌస్ లో ఉన్న కెసిఆర్ ను ప్రజల మధ్య కు తీసుకువచ్చినది మనమేనని.. అన్నం పెట్టుకోడానికి తెచ్చుకున్న సామానులు కూడా తాళం వేశారు, ఇదేం సంస్కృతి అని నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతామని… దుబ్బాక లో ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుందని పేర్కొన్నారు. 2018లో ఓడించడానికి ప్రయత్నం చేసినా… తన ప్రజలు అండగా నిలిచారని… ఇప్పుడు నిలుస్తారన్నారు.