కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా…. బిజెపి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక నిన్న ఈ ఉప ఎన్నిక కు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యం లో హుజురాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్ పేరుతో మరో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హుజురాబాద్ దళిత బందును హుజరాబాద్ లో అమలు అవుతున్న పలు పథకాలను పథకాలను నిలిపి వేయాలని కోరుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరు తో ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నికలను త్వరగా జరపాలని కూడా ఈ లేఖలో కోరినట్లు ఉండటం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలో ఈ ఫేక్ లేఖ పై బీజేపీ పార్టీ స్పందించింది.
టిఆర్ఎస్ పార్టీ కావాలనే ఈటల రాజేందర్ పై ఫేక్ లెటర్ లతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని బిజెపి ఫైర్ అయింది. అయితే దీనిపై టిఆర్ఎస్ ఇంత వరకు స్పందించలేదు. గతంలో లాగా ఈ ఆర్ ఎస్ ఫేక్ లెటర్ ను సృష్టించి రాజకీయ దుమారం లేపుతున్న బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.