సీఎం కేసీఆర్‌… క్యారెక్టర్ లెస్ మనిషి :ఈటల

-

కరీంనగర్ జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నిటి కంటే మనిషికి క్యారక్టర్ అవసరమని… కానీ…ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యారెక్టర్ లెస్ అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రం లో కేసీఅర్ నోటా ఏ మాట వచ్చిన నమ్మని పరిస్థితి ఏర్పడిందని…స్వయం గా మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతుంటే మహిళలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారన్నారు. సిఎం కేసీఅర్ చెప్పే మాటలు అమలు కావని మహిళలు మాట్లాడుకునే ముచ్చట్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు.

మంత్రులు,ఎమ్మెల్యే,ఎంపి లు చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోరని… గతం లో ఉన్న ముఖ్యంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ట, గౌరవం పాతాళానికి పోయిందని.. ఈ విషయాన్ని ఇండియా టుడే సర్వే తేల్చిందన్నారు. హుజూరాబాద్ లో స్వంత పార్టీ ల నాయకులను కొన్న ఘనత సిఎం కేసీఅర్ దేనని చురకలు అంటించారు.

ఎన్నికల నోటిఫికేషన్ భయంతోనే దళిత బంధు ను వాసాల మర్రి లో ప్రారంభించిన ముఖ్యమంత్రి.. మళ్ళీ హుజూరాబాద్ లో ప్రారంభించారని మండిపడ్డారు. తెలంగాణ లో వచ్చే ఆదాయం ఎంత శ్వేత పత్రం విడుదల చేయాలని… 38 సంత్సరలుగా గుర్తుకు రాని దళితుల మీద ప్రేమ ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమంలో ఎం చేసిన నడిచింది..కానీ ఇప్పుడు నడువదని పేర్కొన్నారు. కిరాయి మనుషులతో సోషల్ మీడియా లో పోస్టింగ్ లు ప్రెస్ మీట్ లు పెట్టడం బంద్ చేయాలని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news