కేసీఆర్ త‌న‌.. ప్ర‌భుత్వాన్ని కేంద్రానికి అప్ప‌గించాలి : ఈట‌ల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం కేసీఆర్ పై మ‌రోసారి ఈటల రాజేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దళితలను సీఎం చేయనందుకు, దళిత బంధు, 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు కేసీఆర్ కు చావు డప్పు కొట్టి, దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపు నిచ్చారు. శాంతి భద్రతలను, ప్రజల అవసరాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి స్వయంగా తెలంగాణా భవనంలో బీజేపీ కార్యకర్తల పై దాడి చేయమని చెప్పాడని మండిప‌డ్డారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్య దిష్టిబొమ్మ నాటకం అడుతున్నాడని ఆగ్ర‌హించారు.

నిరుద్యోగులను, రైతులను మోసం చేశాడని..ఎమ్మెల్యేలకు, మంత్రులకు స్వేచ్చ లేదు….ప్రగతి భవనంకు ఇనుప కడ్డీలు వేశాడని మండిప‌డ్డారు. హుజురాబాద్ దెబ్బకు ఫాంహౌస్ నుంచి బయటికొచ్చాడని… పరిపాలన చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైస్ మిల్ లో హై టెక్నాలజీ తో నడిపే యంత్రాలకు సబ్సిడీ ఇవ్వకుండా కేంద్రం పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మీ పార్టీ మోనిపోస్టులో సంక్షేమ పథకాలు పెట్టారా అని నిలదీవారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రైతు వేదికలు కట్టి ఒక్క రైతు సమావేశం నిర్వహించలేద‌ని నిప్పులు చెరిగారు.