కంటి ఆరోగ్యంగా బాగుండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో కంటి సమస్యలు కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్, టీవీ మొదలైన వాటి కారణంగా కంటి పై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. దీనితో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి…?, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

 

విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారం:

కంటి ఆరోగ్యం బాగుండాలంటే సరైన పోషక పదార్థాలు అందాలి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

బరువును కంట్రోల్లో ఉంచుకోవడం:

స్టడీ ప్రకారం ఒబిసిటీ తో బాధపడే వాళ్లకి కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే ప్రెషర్ కంటికి ఇస్తుంది అందుకని బరువుని కూడా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఆకుకూరలు తీసుకుంటే:

ఆకుకూరలు కాయగూరలు కూడా చాలా ముఖ్యం. ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే యువి రేస్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి.

హైడ్రేట్ గా ఉండడం:

డిహైడ్రేషన్ సమస్య తో బాధ పడటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తగిన మోతాదులో నీళ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

స్మోకింగ్ మానేయండి:

స్మోకింగ్ చేసే వాళ్ళలో కంటిచూపు సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మానేస్తే మంచిది దీనితో కంటి ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news