రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్‌ దూరం..ఈటల సంచలన వ్యాఖ్యలు

రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి లేరు …కనీసం సీనియర్ మంత్రి కూడా లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనకు సీఎం పాల్పడ్డారని.. ఇది మంచి సంప్రదాయం కాదని చురకలు అంటించారు. ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం…. సీఎం కి శోభ నివ్వదని చురకలు అంటించారు.

ప్రజాస్వామ్య వాదులు బాధ పడే సంఘటన అని.. గవర్నర్ సామాజిక నేపథ్యం కాదు…. గవర్నర్ చైర్ ను అవమానించారని మండిపడ్డారు. ఇలాంటివి జరగడం రాష్ట్ర ప్రజలకు క్షేమం కాదన్నారు. స్పీకర్ గా పోచారం ఈ రోజు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదని ఫైర్‌ అయ్యారు… ఆయన మాటలు రాజ్యాంగం మీద విషం కక్కడమేనని నిప్పులు చెరిగారు. సీఎం మాటలతో ప్రజలను ఒప్పించే సత్తా కోల్పోయాడు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు.. పోచారం మాటలను చూస్తే సీఎం కావాలనే రాజ్ భవన్ కీ వెళ్లడం లేదనేది స్పష్టం అవుతుందని పేర్కొన్నారు ఈటల.