ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీయే ముద్దని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ తోనే 80 లక్షల కుటుంబాలకు లబ్ది.. కేంద్రం ఒత్తిడి కారణంగానే ఆయుష్మాన్ భారత్ అమలు చేయబోతున్నామని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ తో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ది అందుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం కాదు.. కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన నిధులు ఇప్పించాలని అన్నారు.
కాళేశ్వరంకు జాతీయ హోదాతో పాటు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ అమలుకు విధివిధానాలు త్వరలో ఖరారు చేస్తామని ఆయన అన్నారు. మెడికల్ సీట్లలో ఎవరికి అన్యాయం జరగనివ్వమన్న ఆయన మీడియాలో వచ్చిన వార్తలు మా దృష్టికి వచ్చాయి… అందుకే నిపుణుల కమిటీ వేశామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 80 శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉండగా.. 15 శాతం ఒపెన్ క్యాటగిరి ఉండేదని అందులో జరిగిన తప్పిదాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.