ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అసలు ఆయన ఏ పార్టీలో చేరతారు? కొత్త పార్టీ పెడతారా? లేక ఉద్యమ నేతలతో కలిసి పోరాడుతారా అనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఆయన ప్రతిపక్షా పార్టీల నేతలతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా పార్టీల్లోకి వెళ్తారేమో అని అంతా అనుకున్నారు.
కానీ ఇంకొందరు ఆయన పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ చెప్పారు. అదేం లేదు ఒకవేళ హుజూరాబాద్‌లో మధ్యంతర ఎన్నికలు వస్తే ఆయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు వెళ్లారంటూ ఇంకొందరు నేతలు చెప్పారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈటల రాజేందర్ ఢిల్లీకి పయనమవుతున్నట్టు తెలుస్తోంది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో ఆయన భేటీ కాబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం రేవంత్‌రెడ్డి మధ్య వర్తిత్వం చేస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తులు వస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన కేవలం మద్దతు కోసమే వెళ్తున్నారని, ఏ పార్టీలో చేరబోనని ఇప్పటికే ప్రకటించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.