నన్ను సాదుకుంట‌రా…సంపుకుంట‌రా : ఈటల

హుజురాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…టీఆర్ఎస్ నేతలు మాట్లాడేవి అన్నీ అబద్ధాలేన‌ని అన్నారు. పదవులు ఇచ్చారు, అవమానించి బయటికి పంపించారు అంటూ మండిప‌డ్డారు. కేసీఆర్ అబ్బ జాగీరు కాదు.. పెన్షన్, రేషన్ కార్డులు పోవడానికి. అది మన సొమ్ము…ప్రజల హక్కు హరించడానికి కేసీఆర్ ఎవ‌రంటూ ప్ర‌శ్నించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నావు కదా కెసిఆర్..65 రోజులుగా ఎందుకు దళిత బంధు ఇవ్వలేదంటూ ఈట‌ల ప్ర‌శ్నించారు.

అర చేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నరంటూ మండిప‌డ్డారు.
నన్ను సాదు కుంటార? చంపు కుంటారా? అంటూ ఈట‌ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నా ప్రాణం ఉన్నంతవరకు కెసిఆర్ తో కొట్లాడతా..అంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల్లారా మీకు సిగ్గు ఉందా? ఇందుకా మీకు ప్రజలు ఓట్లు వేసిందంటూ మండి ప‌డ్డారు. నిజాం పాల‌న‌ లాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడి రాజ్యం కాదు కేసీఆర్ అంటూ ఈట‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు.