నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఈటెల…!

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత మొదటి సారి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయం కు ఈటెల వస్తుండడంతో ఆయనకు ఘనంగా సన్మానం చేసేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు ఈటల రాజేందర్ నివాళులు అర్పించనున్నారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అనంతరం అక్కడి నుండి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే హుజరాబాద్ లో ఎన్నికలు బాహా బహీగా జరిగిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్, బిజెపిలు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక అధికార పార్టీ దళిత బంధు పథకం ప్రవేశపెట్టినా ఎన్నికల్లో ప్రజలు ఈటెల వైపే నిలిచారు. అయినప్పటికీ హుజురాబాద్ ఎన్నికల రిజల్ట్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్టే కనిపించింది. మొత్తానికి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై పదివేలకు పైగా మెజారిటీతో ఈటెల విజయం సాధించారు.