సిగరెట్ అనేది చాలా ప్రమాదకరం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మీరు తరుచుగా సిగరెట్ తాగితే ఆరోగ్య పరంగా చాలా నష్టపోతారు. ఇక ఇప్పుడు అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన సంచలన విషయం వెల్లడించింది. మీరు తాగిన సిగరెట్ కూడా ఇతరులకు హాని కలిగిస్తుంది అని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టి) పరిశోధకులు చెప్పారు. సిగరెట్ పీకలు ఏడు రోజుల పాటు కాల్చి పారేసిన తర్వాత పొగ వస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.
నికోటిన్ అనేది ఏడు రోజుల పాటు బయటకు వస్తూనే ఉంటుంది అని, దీనితో సిగరెట్ అలవాటు లేని వారు కూడా ఇబ్బంది పడతారు అని పేర్కొంది. సిగరెట్ లో దాదాపు 15 శాతం నికోటిన్ ఉంటుంది. సిగరెట్ యాష్ ట్రే లో పడేసి అలాగే ఇంట్లో ఉంచితే అనవసరంగా ఇబ్బంది పడతారు అని, ఇది ఊహించని సమస్యలను కలిగిస్తుందని, పిల్లలకు కూడా ప్రమాదకరమే అని హెచ్చరించారు.