స్పెయిన్ లో రోజు రోజుకి పరిస్థితి చాలా దారుణంగా తయారు అయింది. ఊహించని విధంగా కరోనా కేసులు స్పెయిన్ లో పెరుగుతున్నాయి. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే పరిమితం అయినా సరే పరిస్థితులు ఏ మాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. దేశ వ్యాప్తంగా మరణాలు ఇటలీ తో పోటీ పడే పరిస్థితి. వేలాది మంది స్పెయిన్ లో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇక మరణాలు అక్కడ 15 వేలకు చేరువలో ఉన్నాయి. మృతుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుంది. దీనితో ఇప్పుడు మృతదేహాలను కాల్చడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కరోనా కారణంగా దేశంలో 14,045 మంది మరణించారు. దేశంలోని అతిపెద్ద స్మశానవాటిక అయిన మాడ్రిడ్‌లోని లా అల్ముడెనాలో ప్రతి 15 నిమిషాలకు ఒక మృతదేహం అక్కడ దహనం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఎవరిని కూడా రానీయడం లేదు. ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 5 మందికి మించి అనుమతించడంలేదు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో సుమారు 5 వేల మంది మరణించారు. మార్చి 14 నుండి లాక్ డౌన్ ని అక్కడ కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 26 వరకు ఇది కొనసాగుతుంది. క్యూబా నుంచి స్పెయిన్ కి వైద్యులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.