ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు జనాలు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే పరిస్థితి ఏ విధంగా కూడా కనపడటం లేదు. ఇప్పట్లో స్కూల్స్ తెరిచే పరిస్థితి లేదు అనే విషయం అర్ధమవుతుంది. అంటే పరిక్షలు కూడా తెరిచే అవకాశాలు లేవు. విద్యార్ధులకు ఇప్పుడు విద్యా సంవత్సరం విషయంలో ఆందోళన మొదలయింది.
ఇంటర్ పరిక్షలు పూర్తి అయినా పదో తరగతి పరిక్షలు మాత్రం అర్ధం కాని పరిస్థితి. ఎప్పుడు పరిక్షలు నిర్వహిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ పాఠాలు సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో పాఠాలు నేర్పిస్తారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్లాసులు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని రాష్ట్ర అధికారులు మీడియాకు తెలిపారు. ఈ క్లాసులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని, విద్యార్థుల హాజరుకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు సమాచారం అందించి… ఉపాధ్యాయులు కూడా హాజరును పరిశీలించనున్నట్టు సమాచారం.