లాక్ డౌన్ విధిస్తున్న ఒక్కో రాష్ట్రం…!

-

కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ మినహా మరో లాభ౦ లేదు మార్గం లేదు అనే భావనలో ఉన్నారు పాలకులు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నా సరే మన దేశంలో అది కట్టడిలో ఉందీ అంటే కచ్చితంగా లాక్ డౌన్ మార్గం అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కరోనా తీవ్రతను దృష్టి లో పెట్టుకుని లాక్ డౌన్ కి మొగ్గు చూపిస్తున్నాయి.

ఇప్పటికే ఓడిస్సా లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఆ రాష్ట్రం ఈ నెల 30 వరకు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాటలో నడిచింది. లాక్ డౌన్ కి కేంద్రం నిర్ణయం తో సంబంధం లేకుండా తాము ముందుకి వెళ్ళాలని భావిస్తున్నాయి రాష్ట్రాలు. ఇక ఇప్పుడు తెలంగాణా కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్రం నిర్ణయ౦తో సంబంధం లేకుండా…

లాక్ డౌన్ ని కొనసాగించాలని దీనిపై నిర్ణయం వెల్లడించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు లేదా మరిన్ని రోజులు పొడిగించే ఆలోచనలో ఆయన ఉన్నారు. రాష్ట్రంలో కేసులు ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించడం చాలా ఉత్తమం అని భావిస్తున్నారు. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news