ఆడిన ప్రతీసారి, కలలో కూడా RCBని ఓడించాలని కోరుకుంటాను: గౌతమ్ గంభీర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ కోల్‌కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈరోజు 7:30 కు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ అక్కసు వెళ్లగక్కారు. ఆడిన ప్రతీసారి, కలలో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుని ఓడించాలని కోరుకుంటానని అన్నారు. ‘కోహ్లి, డివిలియర్స్, గేల్ వంటి డేంజరస్ క్రికెటర్లు ఉన్నా ఆ జట్టు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు అని వాళ్లు ఏం గెలవకపోయినా అన్నీ గెలిచినట్లు ప్రవర్తిస్తుంటారు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 49కే కోల్‌కతా నైట్ రైడర్స్ ఆలౌట్ చేసింది. అదే జట్టుపై 6ఓవర్లలో 100 రన్స్ కొట్టాం’ అని గంభీర్ అన్నారు.

కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయాన్ని సాధించగా కోల్కత్తా నైట్ రైడర్స్ ఆడిన ఒక మ్యాచ్ లోను గెలుపొందింది.బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో RCB 14 గెలిచింది మరియు కోల్‌కతా 18 మ్యాచ్లలో గెలుపొందింది. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news