తాగుబోతులా …అచ్చోసిన ఆంబోతులా కేటీఆర్ మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్పందస్తూ …’గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో దుర్మార్గం చేసింది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఫోన్ ట్యాపింగ్ తో కేటీఆర్ మంది సంసారాల్లో వేలు పెట్టాడు.

కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ సిగ్గు లేకుండా చెబుతున్నాడు. తాగుబోతు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .అచ్చోసిన ఆంబోతులా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఫలితం అనుభవిస్తాడు. ఫోన్లు విన్నాం.. ఏమౌతుంది అని కేటీఆర్ అంటున్నాడు. ఏమైతది చర్లపల్లిలో చిప్పకూడు తింటావు.’ అని మండిపడ్డారు.బీఆర్ఎస్ చెప్పినట్టు విన్న అధికారుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా చర్యలుంటాయి’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news