మాజీ బాక్సర్ బూన్రో బెర్రిన్(48) లైట్లను చూడలేడు…టీవీ చూడటలేడు..రోజువారి కార్యకలాపాలు కూడా చేయటం కష్టమే. నాలుగు సంవత్సరాల క్రితం వరకూ అతని పరిస్థితి సాధరణంగానే ఉండేదట.. మాయదారి రోగం దాపరించే సరికి తన ఇంట్లోనే తాను ఒక బానిసాలగా బతికే పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే… బెర్రిన్ కు విద్యుత్ ఎలర్జీ వ్యాధి వచ్చింది. దీంతో మొబైల్ తరంగాలు,,విద్యుత్ దీపాలు వెలుతూరు చ్తూస్తే బెర్ప్రిన్ పరిస్థితి భయంకరంగా మారిపోతుంది. వెలుతూరు చూస్తే స్థంబించిపోతాడంట. ఈ వ్యాధి ఏంటో తెలుసుకోవడానికి బెర్రిన్ భారీ మొత్తంలో డబ్బుఖర్చుపెట్టి ప్రపంచం అంతా తిరిగాడు.
ప్రస్తుతం బెర్రిన్ తన భాగస్వామి ముగ్గురు పిల్లలతో కలిసి నార్తాంప్టన్ షైర్ లోని రోత్ వెల్ అనే చిన్న పట్టణంలో ఉంటున్నాడు.. 5జీ, రేడియో తరంగాలను నిరోధించడానికి రూపొందించిన ప్రత్యేక పెయింట్ తో తన బంగ్లాను కోట్ చేసి అందులో ఉంటున్నట్లు బెర్రిన్ తెలిపారు. శీతాకాలంలో తన తోటలో ఒక ప్రత్యేకమైన లోటెక్ ఆశ్రయాన్ని నిర్మించుకుని అక్కడే ఉండాలని బెర్రిన్ యోచిస్తున్నాడు. తద్వారా కనీసం తన కుటుంబసభ్యులు సాధారణ జీవితం గడుపుతారు. అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది… పోనులో కనీసం నాలుగు నిమిషాలు కూడా మాట్లాడలేడు..
బెర్రిన్ తనకు వచ్చిన ఈ సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రజలందరూ ఈడియట్స్ తను ఒక్కడే సాధారణ వ్యక్తి అని చెప్పుకొచ్చాడు.తన జీవతం గురించె బెర్రిన ఏమన్నాడో ఆయన మాటల్లోనే.. ఒక్క గొప్ప గ్రేహూండ్ ట్రయినర్ గా నేను ఎంతోమందికి శిక్షణ ఇచ్చాను. ప్రజలంతా టీవీల్లో పేపర్లలో 5జీ టెక్నాలిజీ అంటూ గొప్పగా చెప్తున్నారు.. ఒక్కసారి ఫోన్ కానీ ఏదైనా విద్యుత్ పరికరాన్ని నాముందు పెట్టండి… ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అవి ఎంత ప్రమాదకరమే అప్పుడు అర్థమవుతుంది.” నాకు ఉన్న ఈ సమస్యను తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ వ్యాదిని ఎలెక్ట్రోఫోబియా లేదా విద్యుదయస్కాంత క్షేత్ర అసహనం సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. నాలుగు శాతం మందికే ఇలాంటి వ్యాధి వస్తుంది అధ్యయనాలు చెపుతున్నాయి. చాలమంది ఇది నిజమా కాదా అనే భ్రమలో ఉన్నారు. కానీ నన్ను చూశాక ఈ వ్యాధి నిజమైనదే అని మీరు నమ్మాలి”. కష్టపడి బాక్సర్ గా జీవితాన్ని గడిపే నాకు.. కదలకుడా మండం మీదే నెలలు తరబడి గడిపాను.
నేను సంవత్సరం క్రితం సెమినార్ కు వెళ్లినప్పుడు నాలంటి సమస్యతో బాధపడే ఒక వ్యక్తిని నేను చూశాను. అతను ఈ సమస్యపై సెమినార్ ఇచ్చాడు. అతనే చెప్పాడు. పూర్తిగా కోలుకునే వరకూ వై- ఫై ఇంటర్నెట్. మొబైల్ ఫోన్లు వంటి వాటికి దూరంగా ఉండమని చెప్పారు.