కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగించింది. అధికారంలో ఉన్న బీజేపీకి చుక్కలు చూపిస్తూ ఓటర్లు మార్పును ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేసుకోవడానికి అయిదు రోజుల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం సిద్దరామయ్యను సీఎంగా ప్రకటిస్తూ నిన్నే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనితో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు షాక్ తగిలింది, కానీ ఇద్దరూ కలిసే పార్టీని ముందుకు నడిపిస్తామని అధిష్టానానికి చెప్పినా డీకే వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కాగా రేపు బెంగుళూరు లోని కంఠీరవ స్టేడియం లో సిద్దరామయ్య సీఎంగా మరియు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితో పాటుగా కొందరు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సిద్దరామయ్య , డీకే లకు మాజీ సీఎం బొమ్మై శుభాకాంక్షలు…
-