రైల్వేలో 548 ఉద్యోగాలు… టెన్త్ ప్యాస్ అయితే చాలు..!

-

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బిలాస్‌పూర్‌ లోని సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం ఒక జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే…

బిలాస్‌పూర్‌ లోని సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం లో 548 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ని కోరుతోంది. ఇక ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు: 548 వున్నాయి. అన్‌ రిజర్వ్‌డ్‌: 215, ఈడబ్ల్యూఎస్‌: 59, ఓబీసీ: 148, ఎస్సీ: 85, ఎస్టీ: 41. ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, టర్నర్‌, వైర్‌మ్యాన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫొటోగ్రాఫర్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. విభాగాలు గురించి చూస్తే… ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, టర్నర్‌, వైర్‌మ్యాన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, ఫొటోగ్రాఫర్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వయసు 15-24 ఏళ్లు ఉండాలి. అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి 1 ఏడాది. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. దరఖాస్తు చివరి తేది జూన్‌ 03, 2023.
పూర్తి వివరాలను https://secr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news