సీఎం అశోక్ గెహ్లాట్ నన్ను అందుకే పొగిడారు : EX సీఎం వసుంధర రాజే

-

రాజస్థాన్ లో రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి… తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. గెహ్లాట్ మాట్లాడిన మాటల్లో రాజస్థాన్ మాజీ సీఎం వసుందర రాజేను ఉద్దేశించి ఆమె లేకుంటే ఈ రోజు మా ప్రభుత్వం నిలబడేది కాదు, ఆమె మా ప్రభుత్వం కూలిపోకుండా కాపాడింది అని చెప్పారు. అయితే ఒక ప్రతిపక్ష పార్టీ సీఎం అభ్యర్థి మాకు సహాయం చేశారని అనడం రాజకీయరం ఎంత కుదుపుకు దారి తీస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల మాజీ సీఎం వసుందర రాజే తాజాగా స్పందించారు. గెహ్లాట్ చేసిన కామెంట్స్ పూర్తిగా అవాస్తవం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతారో అన్న భయంతోనే ఇలా నన్ను పార్టీ మరియు ప్రజల దృష్టిలో అవమానించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.

 

 

ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయంగా చాలా పెద్ద కుట్ర దాగి ఉందని ఆమె తీవ్ర స్థాయిలో అశోక్ గెహ్లాట్ పై ఫైర్ అయ్యారు. ఇది నా జీవితంలో జరిగిన అతి పెద్ద అవమానం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news