బ్రేకింగ్ : మాజీ గవర్నర్‌ సూసైడ్

-

సిబిఐ మాజీ డైరక్టర్, మాజీ గవర్నర్ అశ్వని కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి ఆయన పాల్పడ్డారు. ఆయన గతంలో మణిపూర్, నాగాల్యాండ్ రాష్ట్రాలకు గవర్నర్‌ గా కూడా పని చేశారు. 2006 నుంచి 2008 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పని చేసిన అశ్విని కుమార్ అనంతరం 2008 ఆగస్ట్‌ నుంచి 2010 నవంబర్‌ వరకు సీబీఐ డైరెక్టర్‌గా పని చేశారు.

అనంతరం రిటైర్ అయిన ఆయన్ని 2013- 2014 మధ్య కాలంలో నాగాలాండ్‌ కు గవర్నర్‌ గా నియమించిది అప్పటి యూపీఏ సర్కార్ అదే సమయంలో మణిపూర్‌కు కూడా గవర్నర్‌ గా ఆయన సేవలందించారు. గతకొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న ఆయన ఒత్తిడి వలనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇక అశ్వనీకుమార్‌ మరణాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్‌ చావ్లా ధ్రువీకరించారు. ఎంతోమంది పోలీస్‌ అధికారులకు రోల్ మోడల్ అయిన ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news