లోకేశ్‌కు మాజీ మంత్రి అనికుమార్‌ యాదవ్‌ సవాల్..

-

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. తాజాగా నారా లోకేష్ వ్యాఖ్యలకు మాజీమంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
“లోకేష్ నాకు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని అన్నారు. నా ఆస్తుల వివరాలు అంటూ డాక్యుమెంట్లను విడుదల చేశారు. నా ఆస్తులపై నేను తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పా. మీ పార్టీ నేతలు. నిన్ను నమ్ముకుంటే..కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే” అని అనిల్ ఎద్దేవా చేశారు.

Irrigation Minister Anil Kumar Yadav asserts people are with YSRCP

నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆస్తులకు సంబంధించి నెల్లూరు వెంకటేశ్వరపురంలో తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దమ్ముంటే నారా లోకేశ్ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. లోకేశ్ రాకపోయినా తాను మాత్రం వెంకటేశ్వరపురం వెళ్లి ప్రమాణం చేస్తానని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news